ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా మహిళా అభ్యర్థిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన ఘటనపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఎన్నికల సంఘానికి సమాధానమిచ్చారు. ఓటమి భయంతోనే తన వ్యాఖ్యలను భాజపా వక్రీకరించిందని అందులో పేర్కొన్నారు.
'నా వ్యాఖ్యల్ని భాజపా వక్రీకరించింది' - మధ్యప్రదేశ్ ఎన్నికల సంఘం
రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన 'ఐటం' వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్.. ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలను భాజపా వక్రీకరించిందని సమాధానమిచ్చారు.
'నా వ్యాఖ్యల్ని భాజపా వక్రీకరించింది'
అసెంబ్లీ ఉప ఎన్నికలు ప్రచారంలో భాగంగా గ్వాలియర్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న కమల్‌నాథ్ భాజపా మహిళా అభ్యర్థిని ఉద్దేశిస్తూ 'ఐటం' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం కమల్‌నాథ్‌కు నోటీసులు జారీ చేసింంది.
ఇదీ చూడండి:'ఐటం' వ్యాఖ్యలపై కమల్‌కు ఈసీ నోటీసులు