తెలంగాణ

telangana

By

Published : Sep 15, 2019, 3:25 PM IST

Updated : Sep 30, 2019, 5:14 PM IST

ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​ రాంపురాలో చంబల్ నది బీభత్సం

మధ్యప్రదేశ్​ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చంబల్​నదిపై 50వ దశకంలో నిర్మితమైన గాంధీ సాగర్ ఆనకట్ట రింగ్​వాల్​ దాటి తొలిసారిగా వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. నదీ పరివాహక ప్రాంతంలోని రాంపురాను అర్థరాత్రి సమయంలో వరద చుట్టుముట్టిన కారణంగా ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. రాంపురా పట్టణంలోని సగం ప్రాంతాల్లో 10-12 అడుగుల నీరు చేరింది.

మధ్యప్రదేశ్​ రాంపురాలో చంబల్ నది బీభత్సం

మధ్యప్రదేశ్​ రాంపురాలో చంబల్ నది బీభత్సం

మధ్యప్రదేశ్​లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గాంధీసాగర్ ఆనకట్ట నిర్మాణం పూర్తి అయిన అనంతరం తొలిసారి నది పరివాహక ప్రాంత సరిహద్దు రింగ్​వాల్ దాటి చంబల్ నది నీరు జనావాసాల్లోకి చేరింది. నదీ జలాలు రాంపురానగర్​ను ముంచెత్తాయి. వరద పరిస్థితి తలెత్తుతుందన్న అంచనాలతో నదికి సమీపంలోని లోతట్టు ప్రాంతాలకు చెందిన 200మందిని జిల్లా అధికారులు అంతకుముందే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అర్థరాత్రి పెరిగిన ఉద్ధృతి...

రాత్రి పది గంటల అనంతరం చంబల్​లో వరద తీవ్రరూపం దాల్చింది. రాంపురా బజార్ల వరకు వరద పోటెత్తింది. నదీజలాలు వాణిజ్య ప్రాంతాల వరకు చేరి ప్రజలు అటుఇటు పరుగులు పెట్టారు.

ఈ నేపథ్యంలో పట్టణానికి చేరుకున్న సీఆర్​పీఎఫ్, ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు శ్రమించారు. ఇళ్లల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసే క్రమంలోనే నీటి ఉద్ధృతి పెరగసాగింది. పట్టణంలో 10-12 అడుగుల వరకు నీరు చేరింది. ప్రముఖ వాణిజ్య ప్రాంతాల్లో పడవలు తిరుగుతూ కనిపించాయి.

"రాంపురాలో రాత్రి పది గంటల అనంతరం పెద్దగా శబ్దం రావడం ప్రారంభమయింది. పరిశీలిస్తే రింగ్​వాల్ పైనుంచి పట్టణంలోకి నీరు ప్రవహిస్తోంది. రెండు మూడు గంటల్లోనే రాంపురా జలమయమయింది. ఇళ్లల్లో పలువురు చిక్కుకుపోయారు. పడవల ద్వారా రక్షించడమూ కష్టంగానే ఉంది."

-స్థానికుడు

ఇదీ చూడండి: ఔరా..! రాయిని కొడితే గంట మోగుతోంది!

Last Updated : Sep 30, 2019, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details