తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నదిపై జంపింగ్​ వస్తేనే అందుతుంది స్కూలింగ్​! - పడవలు

పడవలు, తెప్పల సాయంతో నది దాటి ఉంటారు. కానీ, ఎప్పుడైనా దూకి దాటారా? మధ్యప్రదేశ్​లో ఈ విద్యార్థులు మాత్రం చక చకా దూకేసి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరుతున్నారు. వినడానికే భయంగా ఉన్నా... నిజం.

నదిపై జంపింగ్​ వస్తేనే అందుతుంది స్కూలింగ్​!

By

Published : Aug 4, 2019, 7:24 PM IST

మధ్యప్రదేశ్ బేతుల్​ జిల్లా​ భీంపుర్​లో విద్యార్థులు నదిలో నిర్మించిన దిమ్మెలను దాటి పాఠశాలకు వెళ్తున్నారు. ఆ ప్రయాణం వంతెన మీద నడిచినంత తేలిక కాదు. ఒక్కో దిమ్మెకు మధ్య దాదాపు మూడు అడుగుల ఖాళీ స్థలం ఉంటుంది. పొరపాటున కాలు జారిందో అంతే సంగతి. ఒక్క దిమ్మె దాటాలంటేనే వణుకు పుడుతుంది. కానీ, భుజాలకు బ్యాగు తగిలించుకుని ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని భయం లేకుండా దాటేస్తున్నారు ఆ విద్యార్థులు.

అందులోనూ అమ్మాయిలు వీరవనితల్లా దూకేస్తున్నారు. ఉమ్మడిగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ వారు నదిని దాటుతున్న దృశ్యాలు అందరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details