తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జోస్యం తప్పింది.. కుంజీలాల్​ ఇప్పుడు చనిపోయాడు!

2005లో 'నేను ఈ రోజు చనిపోతున్నా' అని  సంచలనం సృష్టించిన ఆ పెద్దాయన 14 ఏళ్ల తర్వాత శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 'పీప్లీ లైవ్ సినిమా కథ నాదే.. నాకు ఆదాయంలో వాటా ఇవ్వండి' అని ఆమీర్​ఖాన్​కు నోటీసులు పంపిన ఆయన ఇకలేరు.​ భవిష్యవాణితో దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన కుంజీలాల్ కన్నుమూశారు.

జ్యోష్యం తప్పింది.. కుంజీలాల్​ ఇప్పుడు చనిపోయాడు!

By

Published : Oct 27, 2019, 6:47 PM IST

Updated : Oct 27, 2019, 7:11 PM IST

జ్యోష్యం తప్పింది.. కుంజీలాల్​ ఇప్పుడు చనిపోయాడు!
2005లో తాను చనిపోతానని అంచనా వేసి.. సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్​కు చెందిన కుంజిలాల్ మాల్వియా అనే జ్యోతిష్కుడు దాదాపు 14 ఏళ్ల తర్వాత శుక్రవారం కన్నుమూశారు. కర్వాచౌత్​ నాడు తాను చనిపోతున్నాని 2005లోనే ముందుగా ప్రకటించి... అప్పట్లో సంచలనం సృష్టించారు కుంజిలాల్​. ఆ వార్త చాలామందికి చేరువై... కుంజీలాల్​ చెప్పిన భవిష్యవాణి దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది. వేలాది మంది ప్రజలు వారి భవిష్యత్తును తెలుసుకునేందుకు ఆయన నివాసానికి వచ్చారు.

కానీ అందరూ నమ్మినట్లు కర్వాచౌత్ నాడు ​ఆయన మరణించలేదు. తన భార్య కర్వాచౌత్​ రోజు చేసిన పూజాఫలం వల్ల తనకు ధీర్ఘాయువు కలిగిందని సర్దిచెప్పుకున్నాడు కుంజీలాల్​.

ఆమీర్​ఖాన్​కు నోటీసులు

ఆ తరువాత 2010 లో.. 'పీప్లీ లైవ్' చిత్రం తన జీవితకథ ఆధారంగా రూపొందించారని ఆరోపించి మరోమారు వార్తల్లో నిలిచారు కుంజీలాల్​. చిత్ర ఆదాయంలో తనకు వాటా కోరుతూ ఆ సినిమా నిర్మాత ఆమీర్ ఖాన్‌కు నోటీసులు పంపి మాల్వియా మళ్లీ వెలుగులోకి వచ్చారు.

2005లో చనిపోతానని ప్రకటించిన 14 ఏళ్ల తర్వాత 90 ఏళ్ల వయసులో మాల్వియా మరణించారు. మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన సెహ్రా సమీపంలోని తప్తి ఘాట్ వద్ద దహనం చేశారు.

ఇదీ చూడండి:మూడు రోజులుగా బోరు బావిలోనే బాలుడు..

Last Updated : Oct 27, 2019, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details