తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​లో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జలమయం - చంబల్​

ఎడతెరపి లేని వర్షాలు మధ్యప్రదేశ్​ను అతలాకుతలం చేస్తున్నాయి. మంద్​సౌర్​, షాజాపుర్​ జిల్లాలపై వరుణుడు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాడు. చంబల్​ నది ఉప్పొంగడంతో.. పలు ప్రాంతాలు నీట మునిగాయి. రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది.

మధ్యప్రదేశ్​లో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జలమయం

By

Published : Sep 15, 2019, 5:41 AM IST

Updated : Sep 30, 2019, 3:54 PM IST

మధ్యప్రదేశ్​లో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జలమయం

మధ్యప్రదేశ్​లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కొద్ది రోజుల విరామం అనంతరం.. మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంద్​సౌర్​, షాజాపుర్​ జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంది. ఇక్కడ చంబల్​ నది ఉప్పొంగి.. పలు ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యాయి.

రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో ఇంటిపైవరకు నీరు చేరుకున్నాయి.

ఆలయంలోకి వరద...

చంబల్​ నదికి క్రమక్రమంగా వరద పెరుగుతుండటంతో.. గాంధీ సాగర్​ ఆనకట్ట గేట్లు ఎత్తివేశారు. మంద్​సౌర్​లో ఓ వంతెన పైభాగాన్ని తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. ఇక్కడి ప్రసిద్ధ పశుపతినాథ్​ ఆలయంలోకీ నీరు చేరింది.

షాజాపుర్​లోనూ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. స్థానిక ఆసుపత్రుల్లోకి నీరు చేరిన కారణంగా... రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.

Last Updated : Sep 30, 2019, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details