దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికలు ముగిశాయి. మధ్యప్రదేశ్లోని రెండు ప్రాంతాల్లో మినహా ఇతర చోట్ల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కర్ణాటకలోని ఓ పోలింగ్ బూత్ వద్ద అత్యధికంగా మధ్యప్రదేశ్లో 28స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. అక్కడ సాయంత్రం 5గంటల 30 నిమిషాల వరకు 66.07శాతం పోలింగ్ నమోదైంది. నాగాలాండ్(2)లో 82.33శాతం, ఉత్తర్ప్రదేశ్(7)లో 41.05శాతం, కర్ణాటక(2)లో 55.04శాతం, ఒడిశా(2)లో 71.10శాతం, హరియాణా(1)లో 51.29శాతం, గుజరాత్(8)లో 51.29శాతం, ఛత్తీస్గఢ్(1)లో 59.05శాతం, ఝార్ఖండ్(2)లో 46.23శాతం ఓట్లు నమోదయ్యాయి.
హింసాత్మకం...
మధ్యప్రదేశ్ మోరినా జిల్లాలోని జతవర పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్-భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ నేపథ్యంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. భిండ్ జిల్లాలోని సోందా గ్రామంలో పోలింగ్‌బూత్ వద్ద కాల్పుల శబ్దం వినిపించినట్లు అధికారులు తెలిపారు.
ఓటేసిన ప్రముఖులు...
భాజపా నేత జోతిరాదిత్య సింధియా, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సహా ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 28 స్థానాల్లో జరిగే ఈ ఉపఎన్నికల్లో.. 355 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 12 మంది రాష్ట్ర మంత్రులు సైతం బరిలో నిలిచారు. ఈ నెల 10 న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఓటు వేస్తున్న జ్యోతిరాదిత్య సింధియా
ఓటు హక్కు వినియోగించుకున్న తోమర్
ఇదీ చూడండి:-సీఎంకు చేదు అనుభవం.. ఉల్లితో ప్రజలు దాడి