తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్య ఒప్పుకోలేదని బిడ్డలను చంపి భర్త ఆత్మహత్య - మధ్యప్రదేశ్ బారాఘట్​ జిల్లా​ రూప్‌జార్ ఘటన

తన ఇద్దరు కుమారులను కిరాతకంగా చంపి.. ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ బారాఘట్​ జిల్లాలో జరిగింది. అలిగి పుట్టింటికి వెళ్లిన తన భార్య.. తిరిగి ఇంటికి రావటానికి నిరాకరించటం వల్ల మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

madhya-pradesh-man-kills-children-commits-suicide-over-domestic-issue
భార్య ఇంటికి రావటంలేదని కుమారులను చంపి.. భర్త ఆత్మహత్య

By

Published : Sep 13, 2020, 3:51 PM IST

భార్య తిరిగి ఇంటికి రావటానికి నిరాకరించిన కారణంగా మనస్తాపానికి గురైన భర్త తన ఇద్దరు కుమారులను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్​ బారాఘట్​ జిల్లాలో ఈ విషాదం జరిగింది.

27 ఏళ్ల భూరా పుసామ్ తన భార్యతో రూప్‌జార్ పోలీస్ స్టేషన్​ పరిధిలో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటం వల్ల భార్య పుట్టింటికి వెళ్లింది. అతని భార్య వెళ్తూ తన ముగ్గురు పిల్లలను కూడా తనతో తీసుకువెళ్ళింది. తిరిగి తన భార్యను ఇంటికి తీసుకురావటం కోసం ఆమె పుట్టింటికి వెళ్ళాడు భూరా.

ఎంత కోరినప్పటికీ భార్య తిరిగి ఇంటికి రావటానికి నిరాకరించింది. దీంతో ముగ్గురు పిల్లలను తనతో పాటు తీసుకొని అడవి మార్గంలో ఇంటికి బయలు దేరాడు. తీవ్ర మనస్తాపానికి గురైన భూరా మార్గమధ్యలో తన ముగ్గురు పిల్లలను గొంతు నులిమి చంపి.. తాను కూడా ఉరి వేసుకున్నాడు. ముగ్గురిలో ఏడాది వయస్సు గల చిన్నారి బతికాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవపంచనామాకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details