తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒక్క దరఖాస్తు చేస్తే.. 360 ఉత్తరాలొచ్చి పడ్డాయి! - మధ్యప్రదేశ్​ సమాచార హక్కు చట్టం

మధ్యప్రదేశ్​కు చెందిన ఓ పాత్రికేయుడు సమాచార హక్కు చట్టంలో దరఖాస్తు చేశారు. ఈ ఒక్క దరఖాస్తుకు దేశవ్యాప్త తపాలా వ్యవస్థ స్పందిస్తోంది. పోస్ట్​ ఆఫీసుల నుంచి  360 ఉత్తరాల్లో సమాచారం వచ్చిపడింది. కానీ, ఆ పాత్రికేయుడు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకో తెలుసా?

ఒక్క దరఖాస్తు చేస్తే.. 360 ఉత్తరాలొచ్చి పడ్డాయి!

By

Published : Oct 16, 2019, 6:31 AM IST

ఒక్క దరఖాస్తు చేస్తే.. 360 ఉత్తరాలొచ్చి పడ్డాయి!

భారత తపాలా కార్యాలయాల స్థిరాస్తి వివరాలు కోరుతూ సమాచార హక్కు చట్టంలో దరఖాస్తు చేశారు ఓ జర్నలిస్ట్​. ఈ దరఖాస్తుకు స్పందించి దేశవ్యాప్తంగా 360 పోస్ట్​ ఆఫీస్​ల నుంచి సమాధానాలు అందుతున్నాయి. కానీ, సమాచారాన్ని ఉత్తరాల రూపంలో పంపడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారాయన.

మధ్యప్రదేశ్​ నీమచ్​కు చెందిన జినేంద్ర సురానా పాత్రికేయుడే కాదు.. సామాజికవేత్త కూడా. తపాలా విభాగం నష్టాల్లో నడుస్తోందని వస్తున్న వార్తలపై వివరణ కోరుతూ, ఆ శాఖ స్థిరాస్తి వివరాలు కావాలాని ఆగస్టు 7న స.హ చట్టంలో దరఖాస్తు చేసుకున్నారు.

ఉత్తరాల కుప్పలు

ఆయన అడిగిన ఒక్క ప్రశ్నకు వందలాది ఉత్తరాలతో సమాధానం పంపించింది తపాలా శాఖ. కానీ, ఇలా సమాచారం ఉత్తరాల రూపంలో కుప్పలు తెప్పలుగా వచ్చి వాలడం తనకు ఇబ్బందిగా ఉందనీ, అందుకు బదులు ఆన్​లైన్​లో సమాచారం అందిస్తే బాగుంటుందంటున్నారు.

ఒక్క ఛీన్​వాడా తపాలా శాఖ మాత్రమే ఆన్​లైన్​లో సమాచారాన్ని అందించిందనీ, మిగతావారు ఉత్తరాలతో ఇల్లంతా నింపేశారని వాపోయారు.

కాగితంపై సగమే
ఉత్తరాల వల్ల సమాచారం సగమే అందుతోందన్నారు సురానా.

సురానా ప్రస్తుత రేటుకు సంబంధించిన సమాచారం కోరుతుంటే, రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలోని ఒక డివిజనల్ పోస్ట్​ ఆఫీసు 1870 సంవత్సరం నాటి ఆస్తి విలువను పంపిందనీ, పూర్తి సమాచారం కోసం మరో దరఖాస్తు చేసుకోవాలా అంటూ ప్రశ్నించారు.

"దేశవ్యాప్తంగా తపాలా విభాగానికి ఎన్ని ఆస్తులున్నాయి, వాటి పుస్తక విలువ, మార్కెట్​లో వాటి రేటెంత అనే వివరాలు కోరుతూ, చీఫ్​ పోస్ట్​ మాస్టర్​ జనరల్​కు దరఖాస్తు పంపాను. ఆయన దేశవ్యాప్తంగా అన్ని కార్యాలయాలకు పంపించారు. నేను ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకున్నప్పుడు, వారు కూడా ఆన్​లైన్​లో సమాధానం ఇవ్వాలి కదా? ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 30 జిల్లాల నుంచి ఉత్తరాలు వచ్చాయి."
-జినేంద్ర సురానా, పాత్రికేయుడు

స. హ చట్టం అమల్లోకి వచ్చి 14 ఏళ్లవుతున్నా.. దాని లక్ష్యాన్ని ప్రభుత్వ శాఖలు ఇంకా అర్థం చేసుకోవట్లేదని ఆయన అన్నారు.

ఇదీ చూడండి:పోలీస్​ స్టేషన్​ లోపల 'టిక్​టాక్' చేస్తే అంతేమరి...!

ABOUT THE AUTHOR

...view details