తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​ గవర్నర్​ మృతి పట్ల ప్రముఖుల సంతాపం - passes away

Madhya Pradesh Governor Lalji Tandon passes away
మధ్యప్రదేశ్​ గవర్నర్​ లాల్​జీ టండన్​ కన్నుమూత

By

Published : Jul 21, 2020, 7:25 AM IST

Updated : Jul 21, 2020, 9:30 AM IST

09:04 July 21

మాయావతి సంతాపం..

లాల్​జీ టండన్​ మృతి పట్ల సంతాపం తెలిపారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఆయన గొప్ప సాంస్కృతిక, సామాజిక వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. తన అన్నయ్యను కోల్పోవటం బాధకలిగించిందని తెలిపారు. 

2003లో ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రిగా మాయావతి ఉన్న సమయంలో రాఖీ పండగ సందర్భంగా.. అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి లాల్​జీ టండన్​కు రాఖీ కట్టారు మాయావతి.

08:52 July 21

రాష్ట్రపతి సంతాపం..

మధ్యప్రదేశ్​ గవర్నర్​ లాల్​జీ టండన్​ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సంతాపం ప్రకటించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. లఖ్​నవూ అధునాత సాంస్కృతికత, రాజకీయ చతురత కలిగిన గొప్ప నేతను మనం కోల్పోయామన్నారు. ఆయన మృతితో తీవ్ర క్షోభకు గురయ్యాయనని తెలిపారు. 

08:36 July 21

దేశం ఒక గొప్ప నేతను కోల్పోయింది..

మధ్యప్రదేశ్​ గవర్నర్​ లాల్​జీ టండన్​ మరణవార్త తనకు బాధకలిగించిందన్నారు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​. ఆయన మరణంతో దేశం ఒక గొప్ప పాలకుడు, సామాజిక కార్యకర్తను కోల్పోయిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. లాల్​జీ కుటుంబానికి సంతాపం తెలిపారు. 

08:17 July 21

మోదీ సంతాపం..

మధ్యప్రదేశ్​ గవర్నర్​ లాల్జీ టండన్​ మృతి పట్ల ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సమాజ సేవకే తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేసుకున్నారు. ఉత్తర్​ ప్రదేశ్​లో భాజపాను బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషించారని, సమర్థవంతమైన నేతగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. ఎప్పుడూ ప్రజాసంక్షేమానికే ప్రాముఖ్యత ఇస్తారని పేర్కొన్నారు. 

07:46 July 21

జూన్​ 11నే ఆస్పత్రిలో చేరిక..

అనారోగ్యం కారణాలతో జూన్​ 11న ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు గవర్నర్​ లాల్​జీ. 15న పరిస్థితి కాస్త విషమించింది. అనంతరం.. ఆయనను వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి మరింత క్షీణించగా మంగళవారం ఉదయం కన్నుమూశారు. 

07:23 July 21

మధ్యప్రదేశ్​ గవర్నర్​ లాల్​జీ టండన్​ కన్నుమూత

మధ్యప్రదేశ్​ గవర్నర్​ లాల్​జీ టండన్(85) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ ఉదయం మరణించినట్లు లాల్​జీ కుమారుడు ఆశుతోష్​ టండన్​ ధ్రువీకరించారు. ​

  • లఖ్‌నవూలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లాల్జీ టండన్ కన్నుమూత
  • శ్వాస ఇబ్బందులు, జ్వరంతో కొద్దిరోజులుగా ఆస్పత్రిలోనే మధ్యప్రదేశ్ గవర్నర్
  • కడుపులో అంతర్గత రక్తస్రావానికి సంబంధించి గతంలో గవర్నర్ టండన్‌కు శస్త్రచికిత్స
Last Updated : Jul 21, 2020, 9:30 AM IST

ABOUT THE AUTHOR

...view details