మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టండన్(85) స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు టండన్. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
జ్వరం, మూత్రాశయ సంబంధిత సమస్యలు తలెత్తటం వల్ల లఖ్‌నవూలోని మేదాంత ఆస్పత్రిలో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని ఆస్పత్రి డైరెక్టర్, వైద్యుడు రాకేశ్ కపూర్ తెలిపారు.