తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​లో మంత్రివర్గ విస్తరణ- సాదాసీదాగా ప్రమాణస్వీకారం - BJP leaders take oath in MP

మధ్యప్రేదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్​ చౌహాన్​ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. రాష్ట్ర గవర్నర్ లాల్​జీ టాండన్​ ఐదుగురు మంత్రుల చేత ప్రమాణం చేయించారు.

MP Cabinet expansion: Five ministers to take oath today
మధ్యప్రదేశ్​లో మంత్రివర్గ విస్తరణ.. సాదాసీదాగా ప్రమాణా స్వీకారం

By

Published : Apr 21, 2020, 6:17 PM IST

మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. రాజ్‌భవన్‌లో అత్యంత సాదాసీదాగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ లాల్‌జీ టాండన్‌ ఐదుగురు మంత్రుల చేత ప్రమాణా స్వీకారం చేయించారు. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలూ... మంత్రులుగా ప్రమాణం చేశారు.

లాక్​డౌన్ కారణంగా వాయిదా..

మంత్రిపదవులు దక్కిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు... జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందినవారు. కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామాతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. మార్చి 23న శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అయితే కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన కారణంగా ఇప్పటివరకూ మంత్రివర్గాన్ని విస్తరించలేదు. తొలి విడతగా ఐదుగురికి మంత్రిపదవులు కట్టబెట్టారు.

తులసి
గోవింద్​
నరోత్తం
మీనా

ఇదీ చూడండి:'ఆ కరోనా రోగికి ప్లాస్మా థెరపీ విజయవంతం!'

ABOUT THE AUTHOR

...view details