మధ్యప్రదేశ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇండోర్ విజయ్ నగర్ ప్రాంతంలోని గోల్డెన్ గేట్ హోటల్ 5 అంతస్తులకు మంటలు వ్యాపించాయి.
సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 12 మందిని రక్షించారు. ఇంకా కొంత మంది మంటల్లో చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.