తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ మోసాంబీలు ఒక్కోటి 2 కిలోలు!

సాధారణంగా మోసాంబీలు గరిష్ఠంగా ఒక్కోటి 500 గ్రాముల వరకు బరువు ఉండొచ్చు. కానీ మధ్యప్రదేశ్​ బైరాడ్​కు చెందిన ఓ రైతు.. 2 కిలోలకుపైగా తూగే మోసాంబీలను పండించాడు. అసలు ఇదెలా సాధ్యమైంది?

Madhya Pradesh farmer grows sweet lime weighing more than 2 kg
ఆ మోసాంబీలు ఒక్కోటి 2 కిలోలు!

By

Published : Sep 23, 2020, 4:55 PM IST

మధ్యప్రదేశ్​ శివపురి జిల్లాలోని బైరాడ్​కు చెందిన ఓ రైతు భారీ మోసాంబీలను పండించాడు. ఒక్కో దాని బరువు.. 2 కిలోల 100 గ్రాములట.

ఇజ్రాయెల్​లో ఉండే తన సోదరుడు వచ్చేటప్పుడు.. 2 మొక్కలను తీసుకొచ్చాడని తెలిపాడు రైతు రామ్​ధయాల్​ రావత్​. రోజూ తగినంత నీళ్లు పోస్తూ, పురుగుల మందు చల్లుతూ ఎంతో జాగ్రత్తగా చూసుకోగా.. ఇలా భారీ పండ్లను ఇచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

భారీ పండ్లను చూపిస్తున్న రైతు

''నేను చెప్పేది నమ్మనివారు.. నా పొలానికి వచ్చి చూసుకోవచ్చు. అక్కడ మోసాంబీ చెట్లను మీరు చూడొచ్చు. నాకు వ్యవసాయం చేయడం.. కొత్త మొక్కలతో ప్రయోగాలు చేయడమంటే ఇష్టం.''

- రామ్​ ధయాల్​ రావత్​, రైతు

అంతకుముందు కూడా రైతు రావత్​.. 500 గ్రా. బరువున్న నిమ్మకాయలను.. ఒక్కోటి 40 కిలోలు తూగే పనసపండ్లను పండించడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details