తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాను జయించిన మధ్యప్రదేశ్​ సీఎం - మధ్యప్రదేశ్​ సీఎంకు కరోనా నెగెటివ్​

మధ్యప్రదేశ్​ సీఎం శివ్​రాజ్​సింగ్​ చౌహాన్​ కరోనా నుంచి కోలుకున్నారు. అయినప్పటికీ వైద్యుల సలహా మేరకు బుధవారం వరకు ఆయన ఐసోలేషన్​లోనే ఉండనున్నారు.

Madhya Pradesh CM tests negative for COVID-19
కరోనాను జయించిన మధ్యప్రదేశ్​ సీఎం

By

Published : Aug 11, 2020, 5:47 PM IST

మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివ్​రాజ్​ సింగ్​ చౌహాన్​ కొవిడ్​పై విజయం సాధించారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్​గా తేలినట్లు ఆయన తెలిపారు.

కరోనా సోకడం వల్ల.. జులై 25న భోపాల్​లోని చిరయూ ఆస్పత్రిలో చేరారు చౌహాన్​.

'కొవిడ్​ పరీక్షల్లో నెగెటివ్​గా తేలింది.​ అయినప్పటికీ ఈ నెల 12వరకు ఐసోలేషన్​లోనే ఉంటున్నాను. నాకు సేవలందించిన వైద్యులు, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు. నా ఆరోగ్యం కోసం పూజించిన ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటాను.'

- శివ్​రాజ్​సింగ్​ చౌహాన్​, మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి

శివ్​రాజ్​సింగ్​ చౌహాన్​ ట్వీట్​

ఇదీ చదవండి:70 శాతానికి చేరువలో కరోనా రికవరీ రేటు

ABOUT THE AUTHOR

...view details