మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. కరోనాను జయించారు. వైరస్ నుంచి కోలుకుని బుధవారం ఉదయం భోపాల్‌లోని చిరాయు ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు.
61ఏళ్ల శివరాజ్ సింగ్ చౌహాన్‌కు గత నెల 25న వైరస్ పాజిటివ్‌గా నిర్ధ రణ అయ్యింది. ఈ నేపథ్యంలో చికిత్స కోసం ఆయన ఆసుపత్రిలో చేరారు.
అయితే డిశ్ఛార్జ్ అనంతరం.. నివాసంలోనూ స్వీయ నిర్బంధం పాటించాలని ముఖ్యమంత్రికి వైద్యులు సూచించారు. 7 రోజుల పాటు ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షించుకోవాలని చెప్పారు.