తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోడ్డు ప్రమాదాల్లో 'కూలీ'న బతుకులు- 16 మంది మృతి - ROAD ACCIDENT

MADYAPRADESH ROAD ACCIDENT
ఘోర రోడ్డు ప్రమాదం- 8 మంది మృతి, 53 మందికి గాయాలు

By

Published : May 14, 2020, 7:35 AM IST

Updated : May 14, 2020, 9:11 AM IST

09:06 May 14

దేశవ్యాప్తంగా జరిగిన వేరువేరు ప్రమాదాల్లో 16 మంది వలసకూలీలు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది చనిపోయారు. ముంబయి నుంచి వలస కూలీలతో ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళుతున్న ట్రక్కును బస్సు ఢీ కొనగా ఈ ప్రమాదం జరిగింది. మరో 54 మంది గాయడ్డారు. వారిని గుణా జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

మరో ప్రమాదం...

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ సమీపంలోగల గలౌలి చెక్‌పోస్ట్ వద్ద, అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలపైకి బస్సు దూసుకెళ్లగా, ఆరుగురు మృతి చేందారు. బిహార్‌లో 32 మంది వలసకూలీలతో ముజఫర్​పుర్‌ నుంచి కటిహార్‌కు వెళుతున్న బస‌్సును.. సమస్తీపూర్‌ వద్ద ఓ ట్రక్కు ఢీ కొనగా ఇద్దరు మరణించారు. 12 మందికి గాయపడగా ఆస్పత్రికి తరలించారు

07:31 May 14

ఘోర రోడ్డు ప్రమాదం- 8 మంది మృతి, 53 మందికి గాయాలు

మధ్యప్రదేశ్​లో ఘోరరోడ్డు ప్రమాదం

మధ్యప్రదేశ్​ గుణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో 8 మంది మృతి చెందగా 53 మందికి గాయాలయ్యాయి. వలస కూలీలను స్వస్థలాలకు చేరుస్తోన్న లారీ బోల్తా కొట్టింది. వీరందరినీ గుణ ఆసుపత్రిలో చేర్చారు. మొత్తం వాహనంలో 65 మంది ప్రయాణించినట్లు సమాచారం. 

Last Updated : May 14, 2020, 9:11 AM IST

ABOUT THE AUTHOR

...view details