తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రక్కు​ బోల్తా.. ఐదుగురు కార్మికులు మృతి - labourers

హైదరాబాద్​ నుంచి ఉత్తర్​ప్రదేశ్​​కు మామిడి పండ్ల లోడుతో వెళ్తున్న ట్రక్కు మధ్యప్రదేశ్​లో బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. శనివారం అర్ధరాత్రి సమయంలో నర్సింగ్​​పుర్​ పథా వద్ద ఘటన జరిగింది.

5 labourers died, 11 injured after the truck they were in, overturned near Patha village in Narsinghpur
ట్రక్కు​ బోల్తా.. ఐదుగురు కార్మికులు మృతి

By

Published : May 10, 2020, 7:07 AM IST

Updated : May 10, 2020, 8:11 AM IST

దేశంలో వరుస ప్రమాదాలు ప్రజలను ఉలిక్కిపడేలాచేస్తున్నాయి. వేర్వేరు ఘటనల్లో పదుల సంఖ్యలో చనిపోతుంటే ఇందులో వలస కార్మికుల సంఖ్యే అధికం. మొన్నటి మహారాష్ట్ర ఔరంగాబాద్​ రైలు ప్రమాదమే అందుకు ఉదాహరణ.

అలాంటి ఘటనే తాజాగా మధ్యప్రదేశ్​లో జరిగింది. తెలంగాణలోని హైదరాబాద్​ నుంచి మామిడ పండ్ల లోడుతో వెళ్తున్న ట్రక్కు.. నర్సింగ్​పుర్​ జిల్లా పథా వద్ద బోల్తా పడింది. ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మరణించారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు స్థానికులు.

వీరంతా వలసకార్మికులని తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాకు ట్రక్కులో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని కలెక్టర్​ తెలిపారు. వాహనంలో ఇద్దరు డ్రైవర్లు, కండక్టరు సహా మొత్తం 18 మంది ఉన్నట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Last Updated : May 10, 2020, 8:11 AM IST

ABOUT THE AUTHOR

...view details