తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీబీ డయాగ్నోస్టిక్ యంత్రాలతో కరోనా పరీక్షలు - -ఐసీఎంఆర్

టీబీ టెస్టులకు ఉపయోగించే డయాగ్నోస్టిక్ యంత్రాలతో కరోనా నిర్ధరణ పరీక్షలు చేయవచ్చని ఐసీఎంఆర్​ స్పష్టం చేసింది. వైరస్ స్క్రీనింగ్, నిర్ధరణ వంటి సమగ్ర పరీక్షలకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని వెల్లడించింది.

icmr corona
ఐసీఎంఆర్

By

Published : May 20, 2020, 12:57 PM IST

దేశంలో కరోనా పరీక్షల వేగాన్ని పెంచే విధంగా భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) పలు మార్గదర్శకాలను సవరించింది. డ్రగ్ రెసిస్టంట్ ట్యూబర్​క్యులోసిస్​(టీబీ) పరీక్షలు నిర్వహించే డయాగ్నోస్టిక్ యంత్రాలతో కొవిడ్ టెస్టులు చేపట్టవచ్చని వెల్లడించింది.

టీబీ పరీక్షలు నిర్వహించే 'ట్రూనాట్' వ్యవస్థ ఉపయోగానికి ఏప్రిల్ 10నే ఆమోదం తెలిపింది ఐసీఎంఆర్. అయితే దీన్ని కేవలం స్క్రీనింగ్ కోసమే ఉపయోగించాలని అప్పట్లో సూచించింది. తాజాగా ఈ మార్గదర్శకాలను సవరిస్తూ ప్రకటన విడుదల చేసింది.

"కొవిడ్-19 కేసుల స్క్రీనింగ్, నిర్ధరణ వంటి సమగ్ర పరీక్షలకు ట్రూనాట్ వ్యవస్థ ఇప్పుడు ఉపయోగపడుతుంది. పరీక్ష రెండో దశ తర్వాత పాజిటివ్​గా తేలిన నమూనాలకు ఆర్​టీ-పీసీఆర్ ద్వారా మరోసారి నిర్ధరించుకునే అవసరం లేదు."

-ఐసీఎంఆర్

ఇవీ సవరణలు

మార్గదర్శకాల ప్రకారం అనుమానాస్పద కరోనా కేసుల నమూనాలను తొలుత ఈ-జీన్ ద్వారా స్క్రీనింగ్ నిర్వహించాలి. నెగెటివ్ వస్తే దాన్ని నెగెటివ్​గానే పరిగణించాలి. పాజిటివ్​ వచ్చిన కేసులను మాత్రం మరో దఫా పరీక్షించి నిర్ధరించుకోవాలి.

రెండో దశలో నిర్వహించే ఆర్​డీఆర్​పీ పరీక్ష.. వైరస్ నిర్ధరణ కోసం. ఈ దశలో పాజిటివ్​గా తేలితే ఆ నమూనాను పూర్తిగా పాజిటివ్​గానే భావించాలి. పాజిటివ్​, నెగెటివ్​తో సంబంధం లేకుండా అన్ని పరీక్షల ఫలితాలను ఐసీఎంఆర్ వెబ్​సైట్​లో పొందుపర్చాలి.

ABOUT THE AUTHOR

...view details