కొత్త(నయా) పాకిస్థాన్ గురించి మాట్లాడుతున్న ఇమ్రాన్‌ఖాన్ ఉగ్రవాదంపై కొత్తగా(నయా) చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్... ఉగ్రవాద నిర్మూలనకు పాక్ నమ్మదగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
పుల్వామా దాడి అనంతరం జైషేకు వ్యతిరేకంగా మాత్రమే చర్యలు తీసుకున్నామని, దీనికి ప్రతిగా తీవ్రవాదులపై చర్యలు తీసుకోకుండా భారత్‌పై పాకిస్థాన్ దాడి చేసిందని తెలిపారు. వాయుసేన ప్రకటించినట్లు ఫిబ్రవరి 27 ఒక్క మిగ్ 21 బైసన్‌ను మాత్రమే కోల్పోయామని పునరుద్ఘాటించారు.