గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్తున్న క్రమంలో ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 23 మంది విద్యార్థులు సహా ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
విహార యాత్రలో విషాదం- 23 మంది పిల్లలకు గాయాలు - విహారయాత్రలో విషాదం
గుజరాత్ చిఖాలి సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 23 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అంక్లేశ్వర్ నుంచి సపుతారాకు విహారయాత్రకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
విహారయాత్రలో విషాదం
అంక్లేశ్వర్ సమీపంలోని అమ్రత్పుర గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సపుతారా ప్రాంతానికి విహారయాత్రకు వెళ్తున్నారు. బస్సు చిఖాలి సమీపంలో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 54 మంది విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
ఇదీ చూడండి: అమ్మ, నాన్న... ఓ 'పాకిస్థానీ' శిశువు!
Last Updated : Feb 29, 2020, 8:17 PM IST