తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రామకోటి తరహాలో 550 నోట్​బుక్స్​లో రామనామం - Ludhiana girl ram ram notebooks

'రామ్​ రామ్'​ అని 550 నోట్​బుక్స్​లో రాసి శ్రీరామునిపై భక్తిని చాటుకుంది పంజాబ్​లోని లుధియానాకు చెందిన 21ఏళ్ల యువతి. వీటిని అయోధ్యలోని రామ మందిరానికి పంపనున్నట్లు తెలిపింది. 2017లోనూ 250 నోట్​బుక్స్​లో 'రామ్​ రామ్'​ అని రాసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో గోల్డ్​ మెడల్​ సాధించింది దీక్షా సూద్​.

Ludhiana girl dedicates 550 copies written Ram Ram to Ayodhya Ram temple
550 నోట్​బుక్స్​లో 'రామ్​ రామ్​' అని రాసిన యువతి

By

Published : Aug 5, 2020, 8:57 PM IST

శ్రీరామునిపై అపారమైన భక్తితో 550 నోట్​బుక్స్​లో 'రామ్​ రామ్' అని రామకోటి తరహాలో రాసింది లుధియానాకు చెందిన దీక్షా సూద్​. ఈ కాపీలను అయోధ్య రామమందిరానికి అంకితం చేస్తున్నట్లు తెలిపింది. 2017లోనూ 250 నోట్​బుక్స్​లో 'రామ్​ రామ్'​ అని రాసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో గోల్డ్​ మెడల్​ కైవసం చేసుకుంది ఈ 21ఏళ్ల యువతి​.

రామకోటి తరహాలో 550 నోట్​బుక్స్​లో రామనామం

"2010 నుంచి రామ్​ రామ్​ అని రాయడం మొదలుపెట్టా. చిన్న నాటి నుంచి కుటుంబంతో కలిసి సత్సంగ్​కు వెళ్లేదాన్ని. అందువల్లే శ్రీరామునికి గొప్ప భక్తురాలినయ్యా. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్నందున వీటిని శ్రీరామునికి అంకితం చేస్తున్నా."

-దీక్షా సూద్​.

నోట్​బుక్స్​లో 'రామ్​ రామ్​ '

ప్రతిఒక్కరు తమ తల్లిదండ్రులను గౌరవించి, రాముడిని పూజించాలని కోరుతోంది దీక్ష. ఏదో ఒక సమయంలో భగవంతుడి అనుగ్రహం దక్కుతుందని చెబుతోంది.

2017లో గోల్డ్​ మెడల్
2017లో గోల్డ్​ మెడల్

ఈ 550 పుస్తకాలను అయోధ్య పంపేందుకు సామాజిక సేవా సంస్థను ఆశ్రయించింది దీక్ష. అయోధ్యలో రామ బ్యాంక్​లో ఈ నోట్​బుక్స్​ను భద్రపరుస్తామని సేవా సంస్థ కార్యకర్త తెలిపారు. వీలైతే భక్తులకు వీటిని పంపిణీ చేసే ప్రయత్నం చేస్తామన్నారు.

2017లో గోల్డ్​ మెడల్

ఇదీ చూడండి: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంకురార్పణ

ABOUT THE AUTHOR

...view details