కరోనా మహమ్మారికి పోలీస్ ఉన్నతాధికారి బలయ్యారు. పంజాబ్ లుథియానా ఏసీపీ అనిల్ కోహ్లీ వైరస్ సోకి మరణించారు.
కరోనా సోకి పోలీస్ ఉన్నతాధికారి మృతి - పంజాబ్ లుథియానా అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కోహ్లి
కరోనా ధాటికి పంజాబ్ లుథియానా అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కోహ్లీ మృతి చెందారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
![కరోనా సోకి పోలీస్ ఉన్నతాధికారి మృతి Ludhiana Assistant Commissioner of Police Anil Kohli passes away](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6842740-thumbnail-3x2-asp.jpg)
కరోనా ధాటికి అసిస్టెంట్ కమిషనర్ మృతి
అనిల్‌కు కరోనా సోకినట్లు కొద్దిరోజుల క్రితమే నిర్ధరణ అయింది. ఎస్పీఎస్ ఆస్పత్రిలో ఆయన్ను చేర్చారు. అనిల్‌కు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించేందుకు పంజాబ్ ప్రభుత్వం శుక్రవారమే అనుమతి ఇచ్చింది. అయితే ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచినట్లు ప్రభుత్వం ప్రకటించింది.