తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్​లో చేరినా... ఆర్​ఎస్​ఎస్​ను వీడలేదు'

బాలీవుడ్​ నటుడు, కాంగ్రెస్ పార్టీ నేత శత్రుఘ్న సిన్హాకు స్వపక్షం నుంచే విమర్శలు ఎదురవుతున్నాయి. షాట్​గన్​ తన భార్య, ఎస్పీ పార్టీ అభ్యర్థి పూనమ్​ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై లఖ్​నవూ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఆచార్య ప్రమోద్ విమర్శలు చేశారు.

'కాంగ్రెస్​లో చేరినా... ఆర్​ఎస్​ఎస్​ను వీడలేదు'

By

Published : May 3, 2019, 5:41 PM IST

Updated : May 3, 2019, 7:18 PM IST

'కాంగ్రెస్​లో చేరినా... ఆర్​ఎస్​ఎస్​ను వీడలేదు'

కాంగ్రెస్​ పార్టీ నేత శత్రుఘ్న సిన్హాకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. తన భార్య, సమాజ్​వాదీ పార్టీ లఖ్​నవూ అభ్యర్థి పూనమ్​ సిన్హా తరపున షాట్​గన్​ ప్రచారం చేయడాన్ని కాంగ్రెస్​ నేత ఆచార్య ప్రమోద్​ తప్పుపట్టారు. అదే నియోజవర్గానికి ఆచార్య ప్రమోద్​ను కాంగ్రెస్​ బరిలో దింపింది.

"శత్రుఘ్న సిన్హా ప్రవర్తన చూస్తుంటే ఆయన కాంగ్రెస్​లో చేరినట్లు కనిపిస్తున్నా, ఇంకా ఆర్​ఎస్​ఎస్​కు రాజీనామా చేసినట్లు లేదు." -ఆచార్య ప్రమోద్​, కాంగ్రెస్​ నేత

పూనమ్​ సిన్హా లఖ్​నవూలో నామినేషన్​ దాఖలు చేసినపుడు శత్రుఘ్న సిన్హా వ్యక్తిగతంగా హాజరయ్యారు. సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​తో కలిసి గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

శత్రుఘ్న సిన్హా ఇటీవలే భాజపాను వీడి కాంగ్రెస్​ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన బిహార్​లోని పట్నా సాహెబ్​ నియోజకవర్గంలో కాంగ్రెస్​ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు.

లఖ్​నవూలో ఐదో దశ లోక్​సభ ఎన్నికలు వచ్చే సోమవారం జరగనున్నాయి.

ఇదీ చూడండి: ఫొని తక్షణ సాయంగా రూ. 1000 కోట్లు: మోదీ

Last Updated : May 3, 2019, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details