తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎల్​టీటీఈపై నిషేధం పొడిగించిన కేంద్రం

శ్రీలంక కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎల్​టీటీఈపై నిషేధాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించింది భారత ప్రభుత్వం. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుండటమే కారణమని పేర్కొంది.

ఎల్​టీటీఐపై నిషేధం పొడిగింపు

By

Published : May 14, 2019, 12:38 PM IST

Updated : May 14, 2019, 2:14 PM IST

లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్​టీటీఈ)పై నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ వ్యతిరేక చర్యల నిరోధక చట్టం-1967 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. భారత సమగ్రత, సార్వభౌమాధికారానికి భంగం కలిగించే హింసాత్మక చర్యలను ఎల్​టీటీఈ కొనసాగిస్తుండటమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.

శ్రీలంక తమిళుల స్వాతంత్ర్యం కోసం ఎల్​టీటీఈని 1976 సంవత్సరంలో పెద్దపులిగా పిలిచే వేలుపిళ్లై ప్రభాకరన్ స్థాపించారు. 2009 సంవత్సరంలో ఆ దేశ ప్రభుత్వం జరిపిన ప్రత్యేక ఆపరేషన్​లో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: చివరి దఫా 'సిత్రం'- అన్న బాటలో సోదరి

Last Updated : May 14, 2019, 2:14 PM IST

ABOUT THE AUTHOR

...view details