తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రంప్​ వ్యాఖ్యలపై రెండోరోజూ దద్దరిల్లిన లోక్​సభ - ట్రంప్ వాఖ్యలు

కశ్మీర్​పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పాలని పార్లమెంటులో డిమాండ్​ చేసింది కాంగ్రెస్. నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు కాంగ్రెస్ సభ్యులు.

దద్దరిల్లిన లోక్​సభ

By

Published : Jul 24, 2019, 1:52 PM IST

కశ్మీర్​ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్యం చేసేందుకు తాను సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చేసిన వ్యాఖ్యలపై లోక్​సభలో రెండోరోజూ గందరగోళం కొనసాగుతోంది. బుధవారం సభ ప్రారంభమైన వెంటనే ప్రధాని మోదీ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశాయి విపక్షాలు. ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్​ వెల్​లోకి దూసుకెళ్లారు 30 మంది సభ్యులు. 'మోదీ జవాబ్​ దో' నినాదాలతో సభను హోరెత్తించారు. పలుమార్లు ఆందోళనల అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు కాంగ్రెస్​ ఎంపీలు.

ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మౌనం వహిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ సభాపక్షనేత అధీర్ రంజన్ చౌదరి.

రాజ్​నాథ్ స్పందన..

కశ్మీర్ అంశాన్ని ట్రంప్​తో మోదీ చర్చించలేదని ప్రతిపక్షాల డిమాండ్​కు సమాధానం చెప్పారు రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రి జై. శంకర్​ ఇది వరకే స్పష్టం చేశారన్నారు. కశ్మీర్​ సమస్యపై మధ్యవర్తిత్వానికి అవకాశమే లేదన్నారు రాజ్​నాథ్​. అలా చేస్తే అది సిమ్లా ఒప్పందానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'సీనియర్ న్యాయవాదుల సమక్షంలోనే ఆదేశాలిస్తాం'

ABOUT THE AUTHOR

...view details