స్పీకర్గా ఓం బిర్లా.. లోక్సభలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆ రోజు జరగాల్సిన చర్చ ముగియకుంటే మరింత సమయం నిస్సందేహంగా పొడిగిస్తున్నారు. ఈ రోజూ గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, రైతుల సంక్షేమంపైనా చర్చ సాగుతున్న నేపథ్యంలో అర్ధరాత్రి వరకు పొడగించారు స్పీకర్.
అయితే సభ్యుల సంఖ్య తక్కువగా ఉండటం గమనించిన ఓం బిర్లా.. వారి తీరుపై మండిపడ్డారు. సభలో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలని సూచించారు. చర్చల్లో పాల్గొని ప్రయోజనాలు పొందాలన్నారు. సభలో ఎప్పుడూ హాజరు శాతం ఎక్కువ ఉండేలా చూడాలని ఆయా పార్టీల సభా నాయకులను ఆదేశించారు స్పీకర్.