తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమేఠీలో నేడు రాహుల్ గాంధీ నామినేషన్​ - అమేఠీ

తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా సమక్షంలో నేడు ఉత్తరప్రదేశ్​ అమేఠీ లోక్​సభ స్థానానికి రాహుల్​ గాంధీ నామపత్రం దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్​ అధ్యక్షుడు ఇప్పటికే  కేరళలోని వయనాడ్​ లోక్​సభ సీటుకు నామినేషన్​ వేశారు.

అమేఠీలో నేడు రాహుల్ నామినేషన్​

By

Published : Apr 10, 2019, 6:42 AM IST

అమేఠీలో నేడు రాహుల్ నామినేషన్​

ఉత్తరప్రదేశ్​ అమేఠీ లోక్​సభ స్థానానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు నామినేషన్ వేయనున్నారు. తొలుత మున్శిగంజ్-దర్పిపుర్​ నుంచి ​గౌరిగంజ్​ వరకు జరిగే రోడ్​ షోలో కాంగ్రెస్​ అధ్యక్షుడు పాల్గొంటారు. అనంతరం అమేఠీ జిల్లా పరిపాలనా కార్యాలయంలో నామపత్రం దాఖలు చేస్తారు. రాహుల్​తో పాటు ఏఐసీసీ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా హాజరవుతారు.

అమేఠీ లోక్​సభ స్థానానికి 15 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాహుల్. 2014లో కాంగ్రెస్​ అధ్యక్షుడిపై పోటీ చేసిన భాజపా నేత స్మృతి ఇరానీ ఈసారీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఆ ఎన్నికల్లో స్మృతి ఇరానీపై రాహుల్​ గాంధీ లక్ష ఓట్లకుపైగా మెజారిటీతో గెలిచారు.

ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నెల 4న కేరళలోని వయనాడ్​ లోక్​సభ స్థానానికి నామపత్రం దాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details