ట్రాన్స్‌జెండర్ల హక్కుల రక్షణ బిల్లు-2019కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. జులై 19న ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రతిపక్షాల నిరసనల మధ్య మూజువాణి ఓటుతో నేడు ఆమోదం పొందింది.
బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాల ప్రశ్నలకు సమాధానమిచ్చారు కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 4లక్షల 80వేల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని తెలిపారు. ట్రాన్స్‌జెండర్లపై దాడులు, లైంగిక వేధింపులకు గురిచేసేవారికి జరిమానాతో పాటు శిక్ష విధించేలా బిల్లులో ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన బిల్లులోని.. ట్రాన్స్‌జెండర్లు యాచించడం నేరంగా పరిగణించే వివాదాస్పద నియమాన్ని తొలగించారు.