వినియోగదారుల రక్షణ బిల్లు-2019ను లోక్సభ ఆమోదించింది. కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) ఏర్పాటు ద్వారా వినియోగదారుల హక్కులను సంరక్షించేందుకు ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది.
ఈ బిల్లు చట్టంగా మారితే ఫిర్యాదు అందిన వెంటనే తక్షణ చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు ఉంటాయని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాసవాన్ తెలిపారు.
"ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు ఉంటాయి. వ్యక్తిగతంగానే కాకుండా ఒక బృందంగా కూడా ఇక నుంచి ఫిర్యాదు చేయొచ్చు. వినియోగదారుల సమస్యలను సులభతరంగా పరిష్కరించుకునేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది."