తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిట్​ఫండ్​ చట్ట సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం - chit fund act amendment bill news

చిట్​ఫండ్​ ద్రవ్య పరిమితి, నిర్వాహకుడి కమీషన్​ పెంపు లక్ష్యంగా చేపట్టిన చిట్​ఫండ్​ చట్ట సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​ లోక్​సభ ముందుకు తీసుకొచ్చారు. చర్చ అనంతరం సభ్యులు బిల్లుకు సానుకూలంగా ఓటు వేశారు.

చిట్​ఫండ్​ చట్ట సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం

By

Published : Nov 20, 2019, 10:05 PM IST

చిట్​ఫండ్​ చట్ట సవరణ బిల్లు-2019కి లోక్​సభ ఆమోదం తెలిపింది. చిట్​ఫండ్​ ద్రవ్య పరిమితి మూడు రెట్లు పెంపు సహా నిర్వాహకుడి కమీషన్​ 5 నుంచి 7 శాతానికి పెంచటానికి ఉద్దేశించి ఈ బిల్లును తీసుకొచ్చారు. చిట్​ఫండ్స్​ను మరింత గౌరవనీయంగా మార్చేందుకు ఈ బిల్లులో మూడు కీలక పదాలను చేర్చారు. అందులో 'ఫ్రాటెర్నిటీ ఫండ్'​, 'రొటేటింగ్​ సేవింగ్స్'​, 'క్రెడిట్​ ఇన్​​స్టిట్యూషన్'​లు ఉన్నాయి.

చిట్​ఫండ్​ సంస్థలు​ పూర్తి చట్టబద్ధత కలిగినవిగా పేర్కొన్నారు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​. క్రమబద్ధీకరించని డిపాజిట్​, పోంజీ పథకాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బిల్లులోని అంశాలు..

  • వ్యక్తిగతంగా లేదా నలుగురికన్నా తక్కువ మంది భాగస్వాములు జమ చేసే నగదు రూ.1లక్ష నుంచి రూ.3లక్షలకు పెరగనుంది. నలుగురు అంతకన్నా ఎక్కువ మంది భాగస్వాములు కలిసి జమ చేసే నగదు రూ.6 లక్షల నుంచి రూ.18 లక్షలకు చేరనుంది.
  • చిట్​ఫండ్​ను నిర్వహించే వారి కమీషన్​ ప్రస్తుతమున్న 5 నుంచి 7 శాతానికి పెరుగుతుంది.
  • 'చిట్​ అమౌంట్​', 'డివిడెండ్'​, 'ప్రైజ్​ అమౌంట్'​ పదాలు.. 'గ్రాస్​ చిట్​ అమౌంట్', 'షేర్​ ఆఫ్​ డిస్కౌంట్​', 'నెట్​ చిట్​ ఫండ్'​ గా మారనున్నాయి.
  • వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా చిట్​ఫండ్​లో చందాదారులుగా చేరే అవకాశాన్ని కల్పిస్తోంది.

లోక్​సభలో చర్చ..

చిట్​ఫండ్​ బిల్లుపై లోక్​సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు అనురాగ్​ ఠాకూర్​. చిట్​ఫండ్​ చందాదారులు బీమా తీసుకోవచ్చని.. కానీ దానిని ప్రభుత్వ తప్పనిసరి చేయట్లేదని స్పష్టం చేశారు. ఆర్థిక నేరాలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణీత సమయంలో తమ పనిని పూర్తి చేయాలన్నారు. జీఎస్టీ నుంచి పేద ప్రజలకు పరిహారం ఇచ్చే విషయం జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. చిట్​ఫండ్​ బిల్లు.. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉపయోగపడుతుందన్నారు.

30 వేలకుపైగా..

దేశంలో 30 వేలకు పైగా చిట్​ఫండ్​ సంస్థలు నమోదై ఉన్నట్లు తెలిపారు భాజపా నేత అనురాగ్​ శర్మ. క్రమబద్ధీకరించనివి ఈ సంఖ్యకు 100 రెట్లకుపైగా ఉంటాయన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు క్రమబద్ధీకరించిన వ్యవస్థలోకి రావాలని నొక్కిచెప్పారు.

ఇదీ చూడండి: త్వరలో పంచదార కష్టాలు... ధరలు భారీగా పెరిగే అవకాశం!

ABOUT THE AUTHOR

...view details