రుణాల ఎగవేత, దివాలా స్మృతి చట్టం సవరణకు పార్లమెంటు ఆమోదం లభించింది. మూడేళ్ల నాటి దివాలా చట్టం సవరణలను లోక్సభలో నేడు సభ్యులు ఆమోదించారు. ఇప్పటికే ఈ బిల్లు రాజ్యసభలో నెగ్గింది.
కొన్ని సెక్షన్లు మినహా చట్టం స్ఫూర్తిని మార్చబోవటం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దివాలా తీసిన కంపెనీలను కాపాడే ప్రయత్నం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.