తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆజంఖాన్​పై ఎంపీల ధ్వజం- క్షమాపణకు డిమాండ్

ఎస్పీ నేత ఆజంఖాన్​ వివాదాస్పద వ్యాఖ్యలపై లోక్​సభ దద్దరిల్లింది. ఆయన వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా ఖండించారు సభ్యులు. ఆజంఖాన్​ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆజంఖాన్​పై ఎంపీల ధ్వజం- క్షమాపణకు డిమాండ్

By

Published : Jul 26, 2019, 4:52 PM IST

Updated : Jul 26, 2019, 6:02 PM IST

లోక్​సభలో భాజపా సభ్యురాలు రమాదేవిపై సమాజ్​వాదీ సభ్యుడు ఆజంఖాన్​ చేసిన అనుచిత వ్యాఖ్యలపై లోక్​సభ దద్దరిల్లింది. పార్టీలకు అతీతంగా సభ్యులందరూ ఆజంఖాన్ వాఖ్యలను వ్యతిరేకించారు. ఆజంఖాన్​పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని లోక్​సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు స్పీకర్ ఓంబిర్లా.

పార్టీలకు అతీతంగా ఏకమైన సభ

కేంద్రమంత్రి రవిశంకర్​ ప్రసాద్​.. ఆజంఖాన్ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయనను లోక్​సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలను కించపరుస్తూ ఆజం​ఖాన్​ చేసిన వ్యాఖ్యలను అందరూ ఖండిస్తుండడం ఆహ్వానించదగిన విషయమన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆజంఖాన్​పై తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్​ను కోరారు.

ఆజం ఖాన్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖమంత్రి స్మృతి ఇరానీ.

లోక్​సభలో స్మృతి ఇరానీ

"ఆజంఖాన్ వ్యాఖ్యలను మహిళలకు మాత్రమే పరిమితం చేయకూడదు. పురుషులు సహా సభ్యులందరికీ ఇది మాయని మచ్చ. మహిళలపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసేందుకు ఇది పురుషులు మాత్రమే వచ్చే సభకాదు. ఈ విధమైన వ్యాఖ్యలు ఏ మహిళ అయినా ఎదుర్కొని పోలీసులను ఆశ్రయిస్తే తప్పకుండా న్యాయం జరిగేది. పని స్థలాల్లో లైంగిక వేధింపుల నియంత్రణ బిల్లును ఇదే పార్లమెంట్ చట్టం చేసింది. మేం ప్రేక్షకుల్లా చూస్తూ కూర్చోలేం. మంత్రిగా, మహిళా ఎంపీగా, లోక్​సభ పక్షంగా చెబుతున్నాను. ఈ సభ మర్యాదను దుర్వినియోగం చేయలేరు. రాజకీయ పార్టీలకు అతీతంగా, లింగ భేదాలు వదిలి మనమంతా ఒకే స్వరం వినిపించాలి. మీరు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయలేరు. దానికి దూరంగా ఉండండి."
-స్మృతి ఇరానీ, కేంద్రమంత్రి

సోనియాను అన్నప్పుడు ఏంచేశారు?

మహిళలను కించపరచడాన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదించదని ఆ పార్టీ లోక్ ​సభాపక్షనేత అధిర్ రంజన్​ చౌదరి అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని అగౌరవపరిచారని భాజపాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Jul 26, 2019, 6:02 PM IST

ABOUT THE AUTHOR

...view details