పంజాబ్‌కు చెందిన ఓ వ్యవసాయ విద్యార్థి ఆస్ట్రేలియా జాతీయ వర్సిటీ నుంచి రూ.1.3 కోట్ల స్కాలర్షిప్కు అర్హత సాధించాడు.
పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీ (ఎల్పీయూ) లో అగ్రికల్చర్ ఎంఎస్సీ చదువుతున్న సుమంత్ బిందాల్.. తన ప్రతిభతో ఆస్ట్రేలియా జాతీయ వర్సిటీలో పీహెచ్డీ సీటు సంపాదించాడు. తన పరిశోధనకు అయ్యే ఖర్చు మొత్తం వర్సిటీయే భరిస్తూ.. సుమంత్‌కు అక్షరాలా రూ. 1.3 కోట్ల స్కాలర్షిప్ ప్రకటించింది.
"ఓ వ్యవసాయ విద్యార్థికి ఇంత భారీ మొత్తంలో స్కాలరిషిప్ రావడం ఇదే తొలిసారి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పీహెచ్డీ ప్రోగ్రామ్ ప్రారంభంకానుంది."