తమిళనాడులోని తిరువణమలైలో విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మరణించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించగా పక్కనే ఉన్న గోడ కూలీ మరికొందరు గాయపడ్డారు.
గోడ కూలిపోవడం వల్ల ఇంట్లో అద్దెకు ఉంటున్న కామాక్షి, ఆమె కుమారుడు హేమనాథ్, పొరుగున ఉన్న చంద్ర మరణించారు. కామాక్షి భర్త జానకి రామన్, మరో కుమారుడు సురేష్ గాయపడినట్లు అధికారి తెలిపారు. గాయపడినవారిని అరాని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.