దేశీయ విమానాల్లో ఎకానమీ క్లాస్ సీట్లకు గత మే 21న ప్రభుత్వం నిర్ణయించిన కనిష్ఠ ఛార్జీలు ప్రస్తుత ప్రీమియం ఎకానమీ క్లాసు సీట్లకు కూడా వర్తిస్తాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఎకానమీ క్లాసు సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ ఛార్జీలు మాత్రం ప్రీమియం ఎకానమీ క్లాసు సీట్లకు వర్తించవని వివరించింది. ఈ మేరకు అక్టోబరు 5న మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కనిష్ఠ ఛార్జీలతో ప్రీమియం ఎకానమీ ప్రయాణం - flights premium charges news
దేశీయంగా తిరిగే విమాన సర్వీసుల్లో ఎకానమీ క్లాస్ సీట్లకు గతంలో ప్రభుత్వం నిర్ణయించిన కనిష్ఠ చార్జీలు వర్తిస్తాయని పౌర విమానయాన శాఖ తెలిపింది. ఐతే ఎకానమీ క్లాస్ సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ ఛార్జీలు మాత్రం ప్రీమియం ఎకానమీ క్లాసు సీట్లకు వర్తించవని పేర్కొంది.
![కనిష్ఠ ఛార్జీలతో ప్రీమియం ఎకానమీ ప్రయాణం Lower fare limits to be applicable to premium economy class seats: Civil Aviation Ministry](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9141991-thumbnail-3x2-flight.jpg)
కనిష్ఠ ఛార్జీలతో ప్రీమియం ఎకానమీ ప్రయాణం
దేశీయ విమానాల్లో గరిష్ఠ, కనిష్ఠ విమాన ఛార్జీలను ఏడు అంచెలుగా సవరిస్తూ మే 21న విమానయాన మంత్రిత్వశాఖ ఓ ప్రకటన చేసింది. ప్రయాణ దూరాన్నిబట్టి వీటిని నిర్ణయించారు. తొలుత ఆగస్టు 24 వరకు ఈ ఛార్జీలు అమలులో ఉంటాయన్నారు. ఆ తర్వాత నవంబరు 24 వరకు ఈ సదుపాయాన్ని పొడిగించారు. భారత దేశీయ విమానాల్లో 'విస్తారా' సర్వీసుల్లో మాత్రమే ప్రీమియం ఎకానమీ క్లాస్ సీట్లు ఉంటాయి. కరోనా మహమ్మారితో 2 నెలల విరామం తర్వాత మే 25 నుంచి దేశీయ సర్వీసులు తిరుగుతున్నాయి.