భారీ వర్షాలకు తమిళనాడులోని తిరుపుర్, ఎరోడ్, నాగపట్టణం, చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించింది. రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వరద నీరు ఇళ్లల్లోకి చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది.
తమిళనాట వరుణ బీభత్సం.. జనజీవనం అతలాకుతలం - భారీ వర్షాలు
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెన్నై, తిరుపుర్, ఎరోడ్, నాగపట్టణం జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది.
తమిళనాడులో వరుణ బీభత్సం
చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొరత్తూర్లోని కాలనీల్లోకి వరద నీరు చేరి కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుపుర్ జిల్లాలోని తిరుమూర్తి జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. జలపాతం వద్దకు పర్యటకులను అనుమతించటం లేదు అధికారులు. నాగపట్టణం జిల్లాలోని మయిలథురాయ్ పట్టణంలోని మయూరునాథస్వామి ఆలయంలోకి వరద నీరు చేరింది.
ఇదీ చూడండి: తమిళనాడులో గోడ కూలి.. 16 మంది మృతి
Last Updated : Dec 2, 2019, 2:04 PM IST