మహారాష్ట్రను వరుణుడు వణికిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం భారీ వర్షాలు ముంబయిని ముంచెత్తగా... ఇప్పుడు నాసిక్ తడిసి ముద్దయింది. జిల్లాలో శనివారం రాత్రి నుంచి కురుస్తున్న జోరు వానలతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
నాసిక్‌లో భారీ వర్షాలతో ఉప్పొంగిన గోదావరి
మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో గోదావరి నది ఉప్పొంగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం అయింది.
నాసిక్
వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదలతో చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. జలాశయాల్లో నీటి మట్టం పెరిగింది. ముందు జాగ్రత్తగా నది ఒడ్డు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని అధికారులు ఖాళీ చేయించారు.
ఇదీ చూడండి: జలశక్తి: స్థానిక సంస్థలకు కేంద్రం మార్గదర్శకాలు