తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అలా చూశాడని బాలుడ్ని హత్య చేసిన ప్రేమికులు - 8 years old boy murder news

తమిళనాడులో దారుణ ఘటన జరిగింది. తాము రహస్యంగా కలుసుకున్నప్పుడు చూశాడని 8 ఏళ్ల బాలుడ్ని క్రూరంగా హత్య చేశారు యువ ప్రేమికులు. అతని మృతదేహాన్ని కొలనులో పడేశారు.

Lovers killed 8 year old boy, after he watched them in private
గుట్టు రట్టవుతుందని 8ఏళ్ల బాలుడ్ని హత్య చేసిన ప్రేమికులు

By

Published : Jun 13, 2020, 4:06 PM IST

తమిళనాడు ఓ ప్రేమ జంట దారుణానికిి ఒడిగట్టింది. తాము ప్రైవేటుగా కలుసుకున్నప్పుడు చూశాడని అభం శుభం తెలియని చిన్నారి అని కూడా చూడకుండా 8ఏళ్ల బాలుడిని కిరాతకంగా హత్య చేశారు యువ ప్రేమికులు. అనంతరం బాలుడి మృతదేహాన్ని కొలనులో పడేశారు.

తిరుప్పూర్ జిల్లా ఊతుకులిలో ఈ ఘటన జరిగింది. మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలుడు పవనేశ్..​ బయటకు వెళ్లి గురువారం ఇంటికి తిరిగి రాలేదు. కంగారుపడిన అతని తల్లిదండ్రులు ఆ ప్రాంతమంతా వెతికినా ఎలాంటి ప్రయోజనం లేదు.

ఇంతలో పల్లగౌండెన్​పలాయం కొలనులో ఓ బాలుడి మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. చిన్నారి మెడపై గాయాలు చూసి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి మృతిచెందిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు.

ఈ హత్యకు 21ఏళ్ల అజిత్, అతని 17ఏళ్ల ప్రేయసే కారణమని పోలీసులు వెల్లడించారు. వారిద్దరూ ప్రైవేటుగా కలుసుకున్నప్పుడు చూశాడనే బాలుడ్ని బలిగొన్నారని పేర్కొన్నారు. పుత్తూర్​ పల్లపాయం కొలను సమీపంలో హత్య చేసి.. మృతదేహాన్ని పల్లగౌండెన్​పలాయం కొలనులో పడేసినట్లు పేర్కొన్నారు.

పవనేశ్ తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న వస్త్ర సంస్థలో పనిచేస్తున్నారు. అతని సోదరుడు విఘ్నేశ్(9) నాలుగో తరగతి చదువుతున్నాడు. చిన్న కుమారుడి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది.

ABOUT THE AUTHOR

...view details