తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ నగరంలో ఒక్కసారిగా భారీ శబ్దం- ఏమైంది? - బెంగళూరులో భారీ శబ్దం

బెంగళూరు విమానాశ్రయం సమీపం నుంచి భారీ శబ్దం వినిపించటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ శబ్దం ఎలా వచ్చిందన్న దానిపై స్పష్టత రాలేదు. భూప్రకంపనలు ఏవీ నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపారు.

bengaluru
నగరంలో భారీ అనుమానాస్పద శబ్దం

By

Published : May 20, 2020, 7:57 PM IST

కర్ణాటక బెంగళూరులో భారీ భయానక శబ్దం వినిపించింది. నగరంలోని తూర్పు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది.అయితే ఈ అనుమానాస్పద శబ్దం ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

విమానాశ్రయం నుంచి..

బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ శబ్దం వచ్చినట్లుగా పలువురు చెబుతున్నారు. కల్యాణ్​ నగర్​, ఎంజీ రోడ్, మారతహళ్లి, వైట్​ఫీల్డ్, సర్జాపుర్​, ఎలక్ట్రానిక్స్ సిటీ, హెబ్బగోడి ప్రాంతాల్లో శబ్దం వినిపించినట్లు తెలుస్తోంది. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు.

"ఉన్నట్టుండి భారీ శబ్దం వినిపించింది. ఇలాంటి శబ్దం ఇది వరకూ ఎప్పుడూ వినలేదు. మొదట బాంబు పేలిందని అనుకున్నాం." అని సిలికాన్​ సిటీ వాసి ఒకరు చెప్పారు.

"మీడియా ద్వారా ఈ సమాచారం మాకు చేరింది. దీని గురించి అత్యవసర నంబరు 100కు ఎలాంటి కాల్స్ రాలేదు. వైమానిక దళ కంట్రోల్​ రూమ్​ను కూడా సంప్రదించి విచారించాం. విమానం లేదా ఏదైనా సూపర్​సోనిక్​ శబ్దమా అని ఆరా తీశాం. వారి సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం."

- భాస్కర్​రావ్​, పోలీస్ కమిషనర్​

భూకంపానికి సంబంధించిన శబ్దమని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. అయితే సిస్మోమీటర్లు ఎలాంటి ప్రకంపనలను నమోదు చేయలేదని రాష్ట్ర విపత్తు పరిశీలన కేంద్రం వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details