సంవత్సర సంవత్సరానికి ఓటింగ్ శాతం పడిపోతోంది. ప్రజలకు అవగాహన కల్పించటానికి ఎన్నికల సంఘంతో పాటు చాలా ప్రభుత్వ సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటున్నాయి.
హిట్ సిరీసైన గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కు(జీఓటీ) యువతలో మంచి క్రేజ్ ఉంది. సోమవారం నుంచి ఆఖరిదైన ఎనిమిదో సీజన్ ప్రారంభంతో ఇది మరింత పెరిగింది. ఈ సిరీస్‌లోని పాత్రల ఇతివృత్తంతో ఓటరు మహాశయులను పోలింగ్ కేంద్రానికి రప్పించే ప్రయత్నం చేస్తున్నాయి ఎన్నికల సంఘం, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో.
వీటితో పాటు ఈ మధ్య పాపులర్ అయిన డైలాగ్‌లను మీమ్స్ కోసం వాడుతున్నాయి వివిధ సంస్థలు, పార్టీలు. కొన్ని ఆసక్తికరమైన ట్వీట్లు మీకోసం...
ఎన్నికల సంఘం...
ఎన్నికల సంఘం ఓటరు అవగాహన కోసం క్విజ్ పోటీ నిర్వహిస్తోంది. ఇందులో మొదటి విడత పూర్తైంది. రెండో విడత కోసం గేమ్ ఆప్ థ్రోన్స్ టైటిల్ పోస్టర్ ఇతివృత్తంతో ట్వీట్ చేసింది.
ఏమి రాబోతుంది? అనే ప్రశ్నతో చేసిన ఈ పోస్టు ఆకట్టుకుంటోంది.
తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి జీఓటీ ఇతివృత్తంతో చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది.
క్రికెట్‌ను కూడా ప్రచారాస్త్రంగా మార్చుకుంది ఈసీ. జాతీయ క్రికెట్ జట్టు బౌలర్ భువనేశ్వర్ బౌలింగ్ వీడియో ట్వీట్ చేసింది.
ప్రజాస్వామ్యం అనే ఆటలో ఓటు ఒక మలుపుతిప్పే సాధనం. - ఈసీ ట్వీట్
ఈసీ మరికొన్ని ట్వీట్లు.