పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. బిజు జనతా దళ్కు చెందిన పార్లమెంటు సభ్యుడి మృతితో లోక్సభలో నివాళి ప్రకటించారు ఎంపీలు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంపీ మృతి చెందారన్న సమాచారం సభ్యులకు తెలిపారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించి సభను రేపటికి వాయిదా వేశారు.
లోక్సభ రేపటికి వాయిదా - రాజ్యసభ
బీజేడీ ఎంపీ కిషోర్ స్వైన్ మృతికి లోక్సభలో ఘననివాళి అర్పించారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ 2 గంటలకు వాయిదా వేశారు ఛైర్మన్.
లోక్సభ రేపటికి వాయిదా
పెద్దల సభలో ఆందోళనలు...
రాజ్యసభలో విపక్షాల ఆందోళనలతో సభ 2 గంటలకు వాయిదా పడింది. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుతో పాటు ఇతర అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం నేపథ్యంలో వాయిదా వేశారు పెద్దల సభ ఛైర్మన్. 2 గంటలకు తిరిగి సభా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.