తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదు నక్షత్రాల హోటల్​ నుంచి లోక్​పాల్​ బాధ్యతలు

దిల్లీలోని 'ద అశోక్​' ఐదు నక్షత్రాల హోటల్​లో భారత లోక్​పాల్​కు తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. లోక్​పాల్​ సిబ్బందితో సహా మిగతా అధికారులూ అక్కడి నుంచే బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఐదు నక్షత్రాల హోటల్​ నుంచి లోక్​పాల్​ బాధ్యతలు

By

Published : Apr 22, 2019, 11:42 PM IST

భారత తొలి లోక్‌పాల్‌ జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ దిల్లీలోని ఐదు నక్షత్రాల హోటల్​ నుంచి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. లోక్​పాల్​ చైర్​ పర్సన్​తో పాటు మిగతా సిబ్బంది కూడా అదే హోటల్​ నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. ఇందుకోసం దిల్లీ చాణక్యపురిలోని 'ద అశోక్​' హోటల్​ను తాత్కాలిక కార్యాలయంగా వినియోగించనున్నారు.

గతనెల 23న రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ సమక్షంలో దేశ మొట్టమొదటి లోక్​పాల్​గా జస్టిస్​ పినాకి చంద్రఘోష్​ ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా లోక్​పాల్​ సభ్యులతో మార్చి 27న జస్టిస్​ చంద్రఘోష్​ ప్రమాణ స్వీకారం చేయించారు.

లోక్​పాల్​ సభ్యుల వీరే...

పారా మిలటరీ దళం ‘సశస్త్ర సీమా బల్‌’ (ఎస్‌ఎస్‌బీ) మాజీ అధిపతి అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ జైన్‌తోపాటు, మాజీ ఐఆర్​ఎస్​ అధికారి మహేంద్ర సింగ్‌, గుజరాత్​ కేడర్​ మాజీ ఐఏఎస్ అధికారి ఇందర్‌జీత్‌ ప్రసాద్‌ గౌతమ్‌, జస్టిస్‌ దిలీప్‌ బి భోసలే, జస్టిస్‌ ప్రదీప్‌ కుమార్‌ మహంతి, జస్టిస్‌ అభిలాషా కుమారి, జస్టిస్‌ అజయ్‌ కుమార్‌ త్రిపాఠిలు లోక్​పాల్​ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ వీరి పేర్లను సిఫార్సు చేయగా, రాష్ట్రపతి భవన్​ ఆమోదముద్ర వేసింది.

ABOUT THE AUTHOR

...view details