తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అవినీతిపై పోరాడేందుకు లోక్​పాల్​ సూపర్​ ఆఫర్​

ప్రభుత్వ అధికారుల అవినీతిపై పాశుపతాస్త్రం లోక్​పాల్​... తన లోగో, మోటో కోసం ఓ పోటీ నిర్వహిస్తోంది. జూన్​ 13 లోపు ఎంట్రీలు పంపడానికి అవకాశం ఉంది. విజేతలకు రూ.25 వేలు నగదు బహుమతి ఉంటుంది.

అవినీతిపై పోరాడేందుకు లోక్​పాల్​ సూపర్​ ఆఫర్​

By

Published : May 28, 2019, 5:25 PM IST

కొత్తగా ఏర్పాటైన 'లోక్​పాల్​' కమిటీ.... తన లోగో, మోటో (నినాదం) రూపొందించడానికి పోటీ ప్రారంభించింది. విజేతలకు రూ.25 వేలు బహుమతి ప్రకటించింది.

ఆకట్టుకొనేలా ఉండాలి..

ఈ పోటీలో పాల్గొనదలిచిన వారు జూన్ 13లోపు తమ ఎంట్రీలను పంపవచ్చు. (మోటో) నినాదం ఆకట్టుకునేలా ఉండాలి. నాలుగైదు పదాలకు మించి ఉండకూడదు. ఇందుకోసం హిందీ, సంస్కృతం, ఆంగ్లభాషలనే వాడాలి.

సరళత, సృజనాత్మకత, కళాత్మక యోగ్యత, విజువల్​ ఇంపాక్ట్​ ఆధారంగా ఎంట్రీలను పరిశీలిస్తారు. లోక్​పాల్​ భావనను ఎంత ప్రభావవంతంగా చెప్పగలుగుతున్నారన్న విషయం ఆధారంగా విజేతను నిర్ణయిస్తారని... అధికారిక ప్రకటన చేసింది లోక్​పాల్​.

ఇప్పటివరకు మోటో కోసం 1,239 ఎంట్రీలు, లోగోకు 365 ఎంట్రీలు వచ్చాయని అధికారులు తెలిపారు.

లోక్​పాల్​..

లోక్​పాల్​, లోకాయుక్త చట్టం 2013 ప్రకారం చట్టబద్ధంగా ఏర్పడింది లోక్​పాల్. ఈ కమిటీ ప్రభుత్వ అధికారుల అవినీతిపై విచారణ చేస్తుంది.

మార్చి 23న రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ జస్టిస్​ పినాకీ చంద్రఘోష్​ను లోక్​పాల్​ ఛైర్​పర్సన్​గా నియమించారు. మార్చి 27న ఎనిమిది మంది లోక్​పాల్​ సభ్యులతో జస్టిస్ ఘోష్​​ ప్రమాణస్వీకారం చేయించారు.

ఇదీ చూడండి: 'మోదీ కుల్ఫీ'... అభిమానానికి చల్లటి రూపం

ABOUT THE AUTHOR

...view details