తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లోక్​పాల్​​ ఆదేశాలను సమీక్షించే అధికారం లేదు'

లోక్​పాల్​ బెంచ్​ జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించే అధికారం ఆ వ్యవస్థకు లేదని లోకాయుక్త చట్టాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ నివేదించింది. సమీక్షకు అధికారం కల్పించేలా చట్ట సవరణ చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది.

Lokpal has no power to review its order
'లోక్​పాల్​ ఆదేశాలను సమీక్షించే అధికారం లేదు'

By

Published : Oct 15, 2020, 3:47 PM IST

అవినీతికి పాల్పడినవారి పని పట్టడానికి ఏర్పాటు చేసిన లోక్​పాల్​ జారీ చేసిన ఆదేశాలను సమీక్షించే అధికారాలు ఆ వ్యవస్థకు లేవు. లోకాయుక్త చట్టం-2013లో ఇందుకు సంబంధించి ఎటువంటి నిబంధనలు లేవని, అందుకే రివ్యూ పిటిషన్లను స్వీకరించలేమని లోక్‌పాల్​ అంబుడ్స్‌మన్​ తెలిపింది.

పెరుగుతున్న ఫిర్యాదులు..

లోక్​పాల్​ జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలించాలనే ఫిర్యాదుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని వెల్లడించింది అంబుడ్స్​మన్. లోక్​పాల్​ ఛైర్​పర్సన్​ పినాకి చంద్ర ఘోష్​కు... జస్టిస్​ అభిలాష్​ కుమార్​, జస్టిస్​ డీకే జైన్​, జస్టిస్​ ఐపీ గౌతమ్​తో కూడిన త్రిసభ్య కమిటీ లోక్​పాల్, లోకాయుక్త​ చట్టాన్ని పరిశీలించి అక్టోబర్​ 6న ఈమేరకు నివేదిక సమర్పించింది.

పిటిషనర్లకు అన్యాయం జరగకుండా ఉండేలా రివ్యూ పిటిషన్ల సమిక్షించే అధికారాలు చట్టంలో చేర్చాలని కేంద్రాన్ని అభ్యర్థించవచ్చని నివేదికలో పేర్కొంది త్రిసభ్య కమిటీ.

ఇదీ చూడండి:లోక్​పాల్​కు వచ్చే ఫిర్యాదులకు నెలలో పరిష్కారం

ABOUT THE AUTHOR

...view details