తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోక్​పాల్​కు వచ్చే ఫిర్యాదులకు నెలలో పరిష్కారం - lokapal news updates

అవినీతికి పాల్పడిన వారిపై లోక్​పాల్​కు చేయాల్సిన ఫిర్యాదుల​ నమూనాను ప్రభుత్వం ప్రకటించింది. వీటిని నెలలో పరిష్కారం చేయాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్​లో పొందుపరిచిన 22 భాషల్లో ఫిర్యాదు చేసుకునే సదుపాయం కల్పించింది.

Lokpal grievances resolved during the month
లోక్​పాల్​ పిర్యాదులను నెలలో పరిష్కారం

By

Published : Mar 4, 2020, 6:56 AM IST

అవినీతికి సంబంధించి లోక్‌పాల్‌కు చేయాల్సిన ఫిర్యాదుల నమూనాను ప్రభుత్వం వెల్లడించింది. ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సాధారణంగా వీటిని ఆంగ్లంలో, ఎలక్ట్రానిక్‌ విధానంలో, నిర్ణీత నమూనాలో స్వీకరిస్తారు. దాంతోపాటు తెలుగు సహా రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పొందుపరిచిన 22 భాషల్లో దేనిలోనైనా ఫిర్యాదు చేసుకునే వీలు కల్పించింది. నమూనా వివరాలను సిబ్బంది వ్యవహారాల శాఖ మంగళవారం వెల్లడించింది. ప్రధానమంత్రి సహా ప్రభుత్వ సేవకులపై అవినీతి సంబంధిత ఫిర్యాదులు స్వీకరించడానికి లోక్‌పాల్‌ ఏర్పాటై ఏడాది అవుతోంది. ప్రస్తుత ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ పినాకీ చంద్రఘోష్‌ ఉన్నారు.

ఫిర్యాదులు ఇలా...

ఫిర్యాదులు చేసేవారంతా నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపు పేపర్‌పై నిర్ణీత నమూనాలో ప్రమాణపత్రం తప్పనిసరిగా దాఖలు చేయాలి.

* తప్పుడు ఆరోపణలు, లేదా అవతలివారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నిస్సారమైన ఆరోపణలు చేస్తే ఏడాది వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుందనేది తమకు పూర్తిగా తెలుసునని ప్రమాణపత్రంలో పేర్కొనాలి.

* ఫిర్యాదుల్ని వ్యక్తిగతంగానైనా అందించవచ్చు, లేదా తపాలాలో పంపించవచ్చు. అయితే సంతకం తప్పనిసరి.

* ఒకవేళ ఇ-మెయిల్‌ ద్వారా పంపిస్తే దానిని ప్రింట్‌ తీసి, 15 రోజుల్లోగా లోక్‌పాల్‌కు పంపించాలి. మిగతా అంశాలన్నీ సరిగా ఉన్నప్పుడు ఒక్క ఈ ప్రతి (కాపీ) కోసమని పెండింగులో ఉంచకూడదు.

* ఒకవేళ ఏదైనా సంస్థ, ట్రస్టు, సొసైటీ, బోర్డు వంటివాటి తరఫున దాఖలు చేస్తున్నట్లయితే దాని నమోదు పత్రం జత చేయాలి.

ప్రధానిపై ఫిర్యాదు వస్తే...

ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, కేంద్ర ప్రభుత్వాధికారులు వంటివారిలో ఎవరిపైనైనా లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ప్రధానిపై ఫిర్యాదు వస్తే దానిని స్వీకరించే దశలోనే లోక్‌పాల్‌ ఛైర్‌పర్సన్‌, మొత్తం సభ్యులంతా కలిసి నిర్ణయం తీసుకుంటారు.

* కేంద్ర ప్రభుత్వ సేవకులపై వచ్చే ఫిర్యాదుల్ని కాలపరిమితితో కూడిన వ్యవధిలోగా పరిష్కరిస్తారు.

లోక్​పాల్​లో సభ్యులు

8మంది( వీరిలో జస్టిస్​ దిలీప్​ బి భోసలే ఇటీవలే రాజీనామా సమర్పించారు.)

1065 (30.09.2019 వరకు లోక్​పాల్​కు వచ్చిన ఫిర్యాదులు)

1000 (వీటిలో పరిష్కరించినవి)

ABOUT THE AUTHOR

...view details