బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎగ్గొట్టి.. విదేశాలకు పారిపోయిన వారి జాబితాను బహిర్గతం చేయాలని పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బ్యాంకు మోసాలకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
రాహుల్ డిమాండ్‌పై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. రుణాలు ఎగ్గొట్టినవారి పేర్లు, వివరాలు అధికారిక వెబ్సైట్లో పొందుపరిచామని చెప్పారు. ఈ అంశంపై సరైన అవగాహన లేకుండానే కాంగ్రెస్ సీనియర్ సభ్యులు మాట్లాడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ హయాంలోనే రుణఎగవేతదారులు దేశం వీడి వెళ్లారని విమర్శించారు ఠాకూర్.