తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోక్​సభలో చర్చకు తలాక్​ బిల్లు- నేడు ఆమోదం! - లోక్​సభ

ముమ్మారు తలాక్​ బిల్లును లోక్​సభలో నేడు చర్చకు తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో బిల్లును ఆమోదింపజేసేందుకు పార్టీ ఎంపీలందరూ తప్పనిసరిగా సభకు హాజరుకావాలని విప్​ జారీ చేసింది భారతీయ జనతా పార్టీ.

లోక్​సభలో చర్చకు తలాక్​ బిల్లు- నేడు ఆమోదం!

By

Published : Jul 25, 2019, 6:12 AM IST

లోక్​సభలో చర్చకు తలాక్​ బిల్లు- నేడు ఆమోదం!
ముస్లిం మహిళల రక్షణ కోసం నూతనంగా రూపొందించిన వివాదాస్పద ముమ్మారు తలాక్​ బిల్లును లోక్​సభలో నేడు చర్చకు తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. గత నెలలోనే సభలో ప్రవేశపెట్టిన్నప్పటికీ... విపక్షాల వ్యతిరేకతతో చర్చ జరగలేదు. ఈ సారి పూర్తి స్థాయి చర్చ జరిపి ఆమోద ముద్ర వేయించాలని పట్టుబడుతోంది ప్రభుత్వం.

ఈ మేరకు తమ లోక్​సభ సభ్యులకు విప్​ జారీ చేసింది భారతీయ జనతా పార్టీ. తప్పనిసరిగా సభకు హాజరుకావాలని ఆదేశించింది.

ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక పార్లమెంటు​ తొలి సెషన్​లో లోక్​సభ ముందుకు తీసుకువచ్చిన మొదటి బిల్లు ఇది. దిగువసభలో ఈ బిల్లును పలు విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. కాంగ్రెస్​, తృణమూల్​ కాంగ్రెస్​, డీఎం​కే వంటి పార్టీలు బిల్లును పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని డిమాండ్​ చేశాయి. ఇందుకు సమాధానంగా లింగసమానత్వం, సామాజిక న్యాయం జరిగేలా బిల్లును రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

భాజపా నేతృత్వంలోని ఎన్​డీఏ ప్రభుత్వానికి లోక్​సభలో పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. దిగువ సభలో బిల్లుకు సునాయాసంగా ఆమోదం లభించే అవకాశం ఉంది. కానీ ఎగువ సభలో సరిపడ సంఖ్యా బలం లేదు. బిల్లుపై విపక్షాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రాజ్యసభలో ఆమోదం లభించటం అంత సులువు కాదన్నది విశ్లేషకుల మాట.

ఇదీ చూడండి: మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్ ఆపరేషన్​ కమల్​'నాథ్​'​!

ABOUT THE AUTHOR

...view details