2019 సార్వత్రిక ఎన్నికలు సమయానికే జరుగుతాయని భారత ఎన్నికల ప్రధాన అధికారి సునీరా అరోరా స్పష్టం చేశారు. భారత, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతల ప్రభావం ఎన్నికలపై ఉండదని తెలిపారు.
"నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. అభ్యర్థులు వారి స్వదేశంలోని వాటితో పాటు విదేశీ ఆస్తుల వివరాలు సమర్పించాలి. వీటిని ఆదాయ పన్ను శాఖ పరిశీలిస్తుంది. తప్పుడు సమాచారముంటే ఎన్నికల సంఘం వెబ్సైట్లో వారి వివరాలు పెడతాం. అంతేకాకుండా వారిపై తగిన చర్యలు తీసుకుంటాం."
-సునీల్ అరోరా, భారత ప్రధాన ఎన్నికల అధికారి