తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు ఓటేయనున్న ప్రధాని మోదీ, అడ్వాణీ... - భాజపా

నేడు సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్​ జరగనుంది. గుజరాత్​లోని 26 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, భాజపా సీనియర్​ నేత ఎల్​కే. అడ్వాణీ, కేంద్ర మంత్రి అరుణ్​జైట్లీ గాంధీనగర్​ లోక్​సభ పరిధి పోలింగ్​ బూత్​లలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

మోదీ, అడ్వాణీ ఓటు

By

Published : Apr 23, 2019, 5:52 AM IST

గుజరాత్​లో ఓటు హక్కు వినియోగించుకోనున్న భాజపా సీనియర్​ నేతలు

సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్​ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్​​ జరగనుంది.

ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్​లో ఒకే విడతలో 26 లోక్​సభ స్థానాలకు ఓటింగ్​ నిర్వహిస్తున్నారు. ఇక్కడి అహ్మదాబాద్​లో ప్రధాని నరేంద్రమోదీ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గాంధీనగర్​ లోక్​సభ పరిధి రనిప్​ ప్రాంతంలోని ఓ పాఠశాల పోలింగ్​ కేంద్రంలో మోదీ ఓటేయనున్నారు.

భాజపా ముఖ్య నేతలంతా ఉదయమే వారికి కేటాయించిన పోలింగ్​ బూత్​లలో ఓటేస్తారని.. పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.

కేంద్ర మంత్రి అరుణ్​జైట్లీ, గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ, ఇక్కడి కాంగ్రెస్​ నేతలు అహ్మద్​ పటేల్​, సోలంకీలు మూడో దశలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్​ షా... గాంధీనగర్​ భాజపా అభ్యర్థి. అంతకుముందు ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన పార్టీ సీనియర్​ నేత అడ్వాణీ ఖాన్పుర్​, షా.. నారణ్​పురాలో తమ ఓటు వేయనున్నారు.

2014 సార్వత్రికంలో గుజరాత్​లోని 26 స్థానాలను భాజపా క్లీన్​స్వీప్​ చేసింది. మొత్తం 4 కోట్ల 51 లక్షల 52 వేల 373 మంది ఓటర్లున్న రాష్ట్రంలో 371 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. ​

ఇదీ చూడండి:ఐదు నక్షత్రాల హోటల్​ నుంచి లోక్​పాల్​ బాధ్యతలు

ABOUT THE AUTHOR

...view details