కార్పొరేట్ పన్ను రేట్లు తగ్గించడానికి తోడ్పడే ఆర్డినెన్స్‌ను భర్తీ చేసే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు 2019-పన్ను చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్ దిగువసభ పచ్చజెండా ఊపింది. 1961 ఆదాయపు పన్ను చట్టం, 2019 ఆర్థిక చట్టాలను తాజా బిల్లు సవరించనుంది.
ఆర్థిక వ్యవస్థకు చేయూతనివ్వడానికి కేంద్రం సెప్టెంబర్‌లో కార్పొరేట్ పన్నులను 10శాతం తగ్గించింది. ఈ మేరకు రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేశారు. సాధారణ కార్పొరేట్ పన్నులను 30 నుంచి 22 శాతానికి పరిమితం చేసింది. నూతనంగా ఏర్పాటైన తయారీ సంస్థలకు పన్నురేటును 25 నుంచి 15శాతానికి తగ్గించింది.